మంత్రి పొన్నం ప్రభాకర్ కు స్వాగతం పలికిన తూంకుంట కాంగ్రెస్ నాయకులు

by Sumithra |
మంత్రి పొన్నం ప్రభాకర్ కు స్వాగతం పలికిన తూంకుంట కాంగ్రెస్ నాయకులు
X

దిశ, శామీర్ పేట : హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు తూంకుంట మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవరయాంజాల్, తూంకుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, రాజీవ్ గాంధీ, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించిన ప్రజలందరికీ అదేవిధంగా కష్టపడిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరుగ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ప్రవేశపెట్టినాము మిగతావి పధకాలు త్వరలోనే ప్రజలకు అందజేస్తామని తెలిపారు. అనంతరం తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తదితరులు విచ్చేసినారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాలేష్, టీపీసీసీ కార్యదర్శి మహిపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పత్తి కుమార్, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు సురేష్ నాయక్, తూంకుంట మున్సిపల్ కౌన్సిలర్లు మధుసూదన్ రెడ్డి, పూజ భరత్ సింగ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed