- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటీ అధికారుల ముసుగులో భారీ చోరి..
దిశ,కంటోన్మెంట్/ బోయిన్ పల్లి : ఐటీ అధికారుల ముసుగులో బంగారు దుకాణంలో దోపిడీకి పాల్పడ్డ మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు. నిందితుల నుండి 60 లక్షల విలువైన 1700 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ కేసులో పదిమంది నిందితులను అరెస్టు చేసి వారి నుండి అపహరించిన మొత్తం సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి వివరించారు. గోవా, మహారాష్ట్రలోని ఖానాపూర్ ప్రాంతానికి చెందిన గణపతి రావు జాదవ్, రుషికేశ్ వినోద్ జాదవ్, శుభం వినోద్ జాదవ్, సంజయ్ పరుశురాంలు నకిలీ ఐటి అధికారులమని చెప్పి గత నెలలో జనరల్ బజార్ లోని బంగారు దుకాణంలో చోరీకి పాల్పడ్డారు.
నార్త్ జోన్ పరిధిలోని పోలీసులు బృందాలు గా ఏర్పడగా చివరికి మార్కెట్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పాట్ మార్కెట్లోని సిద్ధి వినాయక బంగారు దుకాణంలో పనిచేసే జకీర్ అనే వ్యక్తి దోపిడికి కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జకీర్ మహారాష్ట్రలోని ఖానాపూర్ చెందిన తన స్నేహితులు, గోవాలో నివాసం ఉన్న స్నేహితులతో దోపిడీకి పథకం వేశాడని తెలిపారు. మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన అనంతరం దోపిడీ చేసినట్లు పేర్కొన్నారు. తర్వాత ఒక లాడ్జిలో ఉండి గోవా కి పారిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, సెల్ టవర్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశామని, గతంలో విజయవాడలో కూడా ఇదే మాదిరిగా దోపిడీ యత్నానికి ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన జకీర్ తల్లి పై కూడా పోలీసులు కేసునమోదు చేశామన్నారు.