- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సక్సెస్ కు షార్ట్ కట్ లు ఉండవు.. కష్టపడితేనే విజయం: మంత్రి మల్లారెడ్డి
దిశ ప్రతినిధి, మేడ్చల్: సక్సెస్ కు షార్ట్ కట్ లు ఉండవని, కష్టపడితినే విజయం సొంతమవుతుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం శామీర్ పేట జీనోమీ వ్యాలీలో నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర సర్కారు పారిశ్రామిక రంగంలో విప్లమాత్మకమైన మార్పులు తెచ్చినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తుందన్నారు. మంత్రి కేటీఆర్ ఇటీవల అమెరికా వెళ్లి రూ.35 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు వివరించారు. తద్వారా వేలాది మంది యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తుందని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తుందని మంత్రి వెల్లడించారు. టీఎస్ ప్రైడ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తుందన్నారు. కరోనా సమయంలో జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ లాంటి సంస్థలు ప్రపంచానికి 33 శాతం వ్యాక్సిన్ అందించడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి పెద్ద కంపెనీలు నా నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు అభిషేక్ అగస్త్య, పరిశ్రమల శాఖ జోనల్ మేనేజర్ మాధవి, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయ్, జడ్పీటీసీలు అనిత, శైలజ, డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.