- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శం: హోంమంత్రి మహ్మద్ అలీ
దిశ, కుత్బుల్లాపూర్: తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లిలో అరబిందో ఫార్మా సహాకారంతో రూ.2.65 కోట్లతో నిర్మించిన బాచుపల్లి పోలీస్ స్టేషన్ ను శుక్రవారం హోంమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్సీలు సురభి వాణీ దేవి, నవీన్ రావు, పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీపెన్ రవీంద్రలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోనే అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ అని కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకుని వారి సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధించారన్నారు. గడిచిన 9 ఏళ్ళల్లో తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వక పోలీసింగ్ తో పోలీసు శాఖలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాచుపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ నర్సింహా రెడ్డి, స్థానిక కార్పొరేటర్ లు కొలన్ వీరేందర్ రెడ్డి, కాసాని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.