- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ : మంత్రి మల్లారెడ్డి
దిశ, దమ్మాయిగూడ: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్టం దేశంలోనే నెంబర్ వన్ రాష్టంగా నిలిచిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 1, 2, 3,4, 7, 8, 10, 11, 17, 18వ వార్డులలో మున్సిపల్ నిధులు సిఎస్ఆర్, సీడీపీ నిధులు రూ. 3.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం హరిత హారంలో భాగంగా రాజీవ్ గృహకల్ప కాలనీలో డబల్ బెడ్రూం ఇండ్ల వద్ద మొక్కలు నాటారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. దమ్మాయిగూడ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ద్రుష్టి సారిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ ఛైర్మెన్ నరేందరరెడ్డి, కమిషనర్ రాజమల్లయ్య, డీఈఈ చిరంజీవులు, కౌన్సిలర్లు గురువెల్లి వెంకటరమణ, నాను నాయక్, నాగాయపల్లి సుజాత, కొత్త హేమలత, ప్రజా ప్రతినిధులు కాలని వాసులు తదితరులు పాల్గొన్నారు.