- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ లోపు సర్వేను పూర్తి చేస్తాం.. డిప్యూటీ కమిషనర్
దిశ, పేట్ బషీరాబాద్ : ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అందజేసేందుకు చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల డివిజన్ అయోధ్య నగర్ లో ఇంటింటి సర్వే చేస్తున్నారు అధికార బృందం. 829 కుటుంబాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చినప్పటికీ ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. గతంలో సేకరించిన డేటా ప్రకారం అప్పటి కుటుంబాలు ఇంకా ఇక్కడే నివసిస్తున్నారా..?, కుటుంబ సభ్యుల వివరాలలో ఏమైనా మార్పులు చోటుచేసుకున్నాయా..? తదితర అంశాలను పరిశీలిస్తూ సర్వే కొనసాగుతుంది.
కుటుంబ సభ్యుల వివరాలను మార్పులు చేర్పులు చేసుకుంటూ, ఇప్పటివరకు నమోదుగాని కుటుంబ వివరాలను కొత్తగా నమోదు చేసుకుంటున్నారు. సర్వే సమయంలో కుటుంబంలో ఉన్న వారి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు వివరాలను అడుగుతున్నారు. ఒక్కొక్క టీంలో ఇద్దరు చొప్పున మొత్తం 15 టీంలో ఇంటింటి సర్వే చేస్తున్నాయని, ఎనిమిదో తారీకు లోపు అయోధ్య నగర్ లో ఉన్న అన్ని గృహాలలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసి సర్వేను పూర్తి చేస్తామని కుత్బుల్లాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నరసింహ పేర్కొన్నారు.