చదివింది డి-ఫార్మా.. ఎంబీబీఎస్ వైద్యుడిగా అవతారం..

by Aamani |
చదివింది డి-ఫార్మా.. ఎంబీబీఎస్ వైద్యుడిగా అవతారం..
X

దిశ, కీసర : డి-ఫార్మా చదువుకొని.. ఎంబీబీఎస్ వైద్యుడిగా అవతారమెత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేసిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఓటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని దమ్మాయిగూడకు వెళ్ళే దారిలో డీ ఫార్మా చేసిన బండ సాయి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఎంబీబీఎస్ అర్హత లేకుండానే ఎంబీబీఎస్ వైద్యుడిగా అవతారమెత్తి, వైరమ్ లతాశ్రీ మల్టీ స్పెషాలిటీ పేరుతో ఆసుపత్రిని ప్రారంభించి తనకు వచ్చీరాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమా డుతూ ఆసుపత్రిని నడుపుతున్నాడు.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు డీఎంహెచ్ఓ ఇతర జిల్లా వైద్య అధికారులతో కలిసి నకిలీ వైద్యుడు సాయి వర్ధన్ రెడ్డి ఆట కట్టించారు. చట్ట విరుద్ధంగా అర్హత లేకున్నా ఎంబీబీఎస్ డాక్టర్ గా చికిత్సలు చేస్తున్నాడు. దీంతో జిల్లా వైద్యాధికారులు, ఎస్ఓటీ పోలీసులు నకిలీ వైద్యుడు సాయి వర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి, ఆసుపత్రిని సీజ్ చేశారు. అతని నుంచి కారు,రూ. 8500 నగదు, స్టెతస్కోప్, రోగులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకుని నకిలీ వైద్యుడిని పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed