నల్సార్ లా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన..

by Aamani |
నల్సార్ లా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన..
X

దిశ,శామీర్ పేట: తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని శామీర్ పేట లోని నల్సార్ లా యూనివర్సిటీలో సమాన హక్కులు కల్పించాలని గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ న్యాయ విద్యాలయంలోనే సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో లా విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను మాకు కల్పించకుండా ద్వితీయ పౌరులుగా పరిగణిస్తున్నారన్నారు. లక్షల రూపాయలు ఫీజులు కట్టి మేనేజ్మెంట్ కోర్సులు చదివితే విద్యార్థులను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం యూనివర్సిటీ విద్యార్థి సంఘంలో మమ్మల్ని సభ్యులుగా కూడా ఇప్పటివరకు చూడటం లేదని అన్నారు.

మా సమస్యలు పరిష్కరించాలని అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందన లేదన్నారు. యూనివర్సిటీలో మొత్తం 1200 మంది విద్యార్థులు ఉంటే ఎల్.ఎల్.బి కాకుండా ఇతర కోర్సులు చదివే విద్యార్థులు 500 మంది ఉంటారని తెలిపారు. వెంటనే అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని విద్యార్థులు అందరూ ప్లకార్డు ప్రదర్శిస్తూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ధర్నా చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed