బీఆర్​ఎస్​ పాలనలో ఎస్​టీపీ ప్లాంట్​లకు శ్రీకారం

by Sridhar Babu |
బీఆర్​ఎస్​ పాలనలో ఎస్​టీపీ ప్లాంట్​లకు శ్రీకారం
X

దిశ, కూకట్​పల్లి : చెరువులలో మురుగునీరు చేరకుండా డ్రైనేజీ నీటిని శుద్ధి చేసేందుకు మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ బీఆర్​ఎస్​ హయాంలో ఎస్​టీపీ ప్లాంట్​ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నియోజకవర్గం పరిధి ఫతేనగర్​లోని ఎస్​టీపీ ప్లాంట్​ను శనివారం కార్పొరేటర్లు​ సతీష్​ గౌడ్​, ఆవుల రవీందర్​ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ చెరువులను శుభ్రమైన, శుద్ధి చేసిన నీళ్లతో నింపాలన్న ఉద్దేశంతో బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్​ ఎస్​టీపీ ప్లాంట్​ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి కూకట్​పల్లిలో ఎస్​టీపీల నిర్మాణాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.

డ్రైనేజీ నీళ్లు నేరుగా చెరువుల్లోకి ప్రవహించడం వల్ల చెరువులోని నీరు కలుషితమై గుర్రపు డెక్క పెరగడం తద్వారా దోమల సమస్యతో సమీప కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్నట్టు తెలిపారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి మాజీ మంత్రి కేటీఆర్ సరికొత్త ఆలోచనలతో ఎస్​టీపీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. నియోజకవర్గంలో 325 కోట్ల రూపాయలతో 9 చెరువులపై ఎస్​టీపీ ప్లాంట్​లను నిర్మిస్తున్నామని అన్నారు. ఫతేనగర్ డివిజన్​ పరిధిలో ఎస్​టీపీ నిర్మాణ పనులు పూర్తిచేసుకుని శంకుస్థాపనకు సిద్ధంగా ఉందని అన్నారు. నిర్మాణ పనులను చూస్తుంటే కాలేశ్వరం తరహాలో ఎస్​టీపీలోకి వచ్చిన మురుగు నీరు శుద్ధి అయి చెరువులలోకి చేరుతున్నాయని అన్నారు. మరికొన్ని చెరువుల వద్ద జరిగే పనులలో జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఫతేనగర్ ఎస్​టీపీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.

Advertisement

Next Story

Most Viewed