రాష్ట్రస్థాయి మహిళా రగ్బీ పోటీలు ప్రారంభం

by Sridhar Babu |
రాష్ట్రస్థాయి మహిళా రగ్బీ  పోటీలు ప్రారంభం
X

దిశ, తిరుమలగిరి : సికింద్రాబాద్ బోయినపల్లిలోని కృష్ణస్వామి క్రీడా మైదానంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్రస్థాయి మహిళా రగ్బీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్ర మానికి మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారిణిలు గ్రామస్థాయి నుండి ఒలింపిక్స్‌ వరకు ఎదిగి ప్రపంచ నలుమూలలా పేరు తేవాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం రగ్బీ లీగ్‌ క్రీడలను ప్రోత్సహించడం హర్షణీయమన్నారు. ఈ క్రీడకు యువత నుండి మంచి స్పందన వస్తుందన్నారు. పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ పోటీలకు ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల క్రీడాకారులు, పీఈటీలు, కోచ్ లు క్రీడాకారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed