SPOT ADMISSIONS : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో స్పాట్ ప్రవేశాలు...

by Kalyani |
SPOT ADMISSIONS : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో స్పాట్ ప్రవేశాలు...
X

దిశ, శామీర్ పేట: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జూనియర్ ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈనెల 26, 27 తేదీలలో స్పాట్ కౌన్సిలింగ్ కార్యక్రమం చేపడుతున్నట్లు టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ జూనియర్ కాలేజ్ (బాయ్స్ )షామీర్ పేట ప్రిన్సిపాల్ జి. వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి నీ మార్చి 2024 లో ఉత్తీర్ణులైన బాలికలకు 26న, 27న బాలురులకు నిర్వహిస్తున్నట్లు అన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష 50 వేలు మించకుండా ఉండాలన్నారు .అర్హత ఆసక్తి కలిగిన విద్యార్థులు నిర్దేశించిన తేదీన ఉదయం 9 గంటలకు వరకు దృవపత్రాలతో నిర్ణయించిన స్పాట్లో హాజరు కాగలరని అన్నారు.



Next Story