- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూకట్పల్లి నియోజకవర్గంలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గంలో అసెంబ్లి ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ నాయకులుబూత్స్థాయి సమావేశాలలో బీజేపీ నాయకులపై విరుచుకుపడుతుంటే, బీజేపీ నాయకులు కార్నర్ మీటింగ్‌ల పేరుతో బీఆర్ఎస్ నాయకుపై కబ్జాలు, అవినీతి ఆరోపణల బాణాలు సందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కూకట్పల్లి నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు ఏర్పాటు చేసుకుంటున్న సమావేశాలలో పరస్పర ఆరోపణలతో రచ్చ జరుగుతుంది. కూకట్‌పల్లిలోని చారిత్రక కట్టడం బీజేపీ కార్యాలయం ఆనుకుని ఉన్న కుతుబ్షాహి కాలంలో కట్టిన ఐదు వందల ఏండ్ల చరిత్ర కలిగిన చారిత్రక కట్టడం కమాన్‌ను బీజేపీ నాయకులు కబ్జా చేసి తమ సొంత జాగీరుల వాడుకుంటున్నారని, ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కమాన్, దానికి ఆనుకున్న భూములు ప్రైవేటు ఆస్తులు ఎలా అవుతాయని బీఆర్ఎస్నాయకులు ఆరోపిస్తున్నారు.
అదేవిధంగా గత రెండు రోజులుగా వాట్సాప్ వేదికగా పోస్టులు పెడుతూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతే కాకుండా ఈ మధ్య కూకట్పల్లి నియోజకవర్గంలో ఆయా డివిజన్లలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ల సమావేశాలలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం బీజేపీ నాయకులపై సవాల్‌విసిరారు. కూకట్పల్లి పరిధిలోని పలు చెరువుల సమీపంలో బీజేపీ నాయకులు భూమిని కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. దానికి కౌంటర్‌గా బీజేపీ ఇన్చార్జి మాధవరం కాంతారావు అసలు కూకట్పల్లి నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతుందని, ఎక్కడ భూకబ్జాలు జరిగినా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా, అక్రమాలు జరిగినా ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరుల హస్తం ఉంటుందని ఆరోపించారు. ఎమ్మెల్యేకి తెలవకుండా నియోజకవర్గంలో అక్రమాలు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు.
ఒకవేళ బీజేపీ నాయకులు కబ్జాలకు పాల్పడి ఉంటే అధికారంలో ఉన్న మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదో జవాబు చెప్పాలని ప్రశ్నించారు. ఏది ఏమైనా కూకట్‌పల్లిలో రోజూ బీఆర్ఎస్, బీజేపీ నాయకుల పరస్పర మాటల యుద్ధం రాష్ట్రంలోలేని ఎన్నికల వేడిని కూకట్‌పల్లిలో పుట్టిస్తుందనే చెప్పవచ్చు. కాగా రెండు పార్టీలు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రోజూ సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల మధ్యకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు తమదే హైట్రిక్ విజయం అని ధీమా వ్యక్తం చేస్తుంటే, బీజేపీ నాయకులు మాత్రం రాష్ట్రంలో, దేశంలో బీజేపీ గాలి వీస్తుందని, రానున్న ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమాగా ఉన్నారు. ఏది ఏమైనా న్యాయ నిర్ణేతలు ఓటర్లు వారు ఎవరిని అందలం ఎక్కిస్తారు, ఎవరిని పాతాళంలోకి తోక్కేస్తారో వేచి చూడాలి.