Seize: అనుమతి లేని బోర్లు సీజ్

by Kalyani |
Seize: అనుమతి లేని బోర్లు సీజ్
X

దిశ, దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీలో అక్రమంగా వెలసిన బోర్లపై రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు. బౌరంపేటలో 4 బోర్లు, దుండిగల్ లో 3 బోర్లను జిల్లా కలెక్టర్, జిల్లా భూగర్భ జల వనరుల అధికారుల ఆదేశాలతో దుండిగల్ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గతంలో అక్రమ బోర్ల ఏర్పాటు,అక్రమ నీటి దందా పై దిశ దిన పత్రికలో వరుస కథనాలు వెలువడడంతో జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారుల ఆదేశాలతో దుండిగల్ మండల రెవెన్యూ అధికారులు అనుమతి లేకుండా వెలసిన బోర్ల ను సీజ్ చేసి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసి 3 మాసాలు గడుస్తున్నా నోటీస్ లకు సమాధానం రాకపోవడంతో శుక్రవారం జిల్లా అధికారుల ఆదేశాలతో సీజ్ చేసినట్లు సమాచారం. దుండిగల్ మండల తహసీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్ ను దిశ ప్రతినిధి వివరణ కోరగా… అనుమతి లేకుండా బోర్లు ఏర్పాటుచేసి యథేచ్చగా నీటి వ్యాపారం కొనసాగిస్తుండడంతో జిల్లా అధికారుల ఆదేశాలతో గతంలో నోటీసులు జారీ చేశామన్నారు. ఇప్పటి వరకు నోటీసులకు స్పందన లేదన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారుల ఆదేశాలతో బౌరంపేట లో 4 బోర్లను, దుండిగల్ లో 3 బోర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.



Next Story