- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమంగా మందులు నిలువ ఉంచిన సైకాలజిస్ట్ ఇంట్లో సోదాలు..
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఓ ఇంట్లో సైకోట్రోపిక్ డ్రగ్స్ నిలువ ఉంచినట్టు అందిన సమాచారం మేరకు మేడ్చల్ డ్రగ్ కంట్రోల్ విభాగం ఏడీ జి. శ్రీనివాస్ నేతృత్వంలో కూకట్పల్లి డ్రగ్ ఇన్ స్పెక్టర్ సహజ, మేడ్చల్ డ్రగ్ ఇన్ స్పెక్టర్ హేమలత, షామీర్పేట్ డ్రగ్ ఇన్ స్పెక్టర్ బి.ప్రవీణ్‌లు సోదాలు నిర్వహించారు. కేపీహెచ్‌బీ డివిజన్ వసంత్‌నగర్ కాలనీలో ఇంటి నంబర్ 16–3–208/1 లోని గ్రౌండ్ ఫ్లోర్లో సైకాలజిస్ట్ డాక్టర్ క్రాంతికారి తన ఇంట్లో సైకోట్రోపిక్ డ్రగ్స్ అయిన క్లోనజెపమ్, లోరజెపమ్, రిస్పెర్డోన్, అమిత్రైపిటిలిన్, ఎస్కిటలోపరమ్, ప్లోక్సెటైన్లతో పాటు మరికొన్ని మందులను ఎటువంటి అనుమతులు లేకుండా నిలువ ఉంచినట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి సోదాలు నిర్వహించారు.
డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ ఆక్ట్ 1940 అండ్ రూల్స్ 1945 ప్రకారం నేరంగా పరిగణిస్తూ నిలువ ఉంచిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సదరు డాక్టర్ క్రాంతికారి వద్ద లభించిన మందులు ప్రిస్ర్కైబ్ చేయడానికి విద్యార్హత లేదని తెలిపారు. డాక్టర్ క్రాంతికారిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్టు వారు తెలిపారు.