- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ ఢిల్లీ పర్యటన రహాస్యాలను రేపే బయటపెడుతా.. రేవంత్ రెడ్డి
దిశ ప్రతినిధి, మేడ్చల్ : కేటీఆర్ ఢిల్లీ పర్యటన పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. తన బంధువుల, వ్యాపార భాగస్వాముల మెడికల్ కాలేజీల పై ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టర్ (ఈడి) దాడుల విషయమై కేటీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లారని ఆరోపించారు. శుక్రవారం తూంకుంటలోని మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబుల్ రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలోని ఏఏ మెడికల్ కాలేజీలతో కేటీఆర్ కు సంబంధాలున్నాయి. వాటిల్లో కేసీఆర్ వాటలెంత ఏ బంధువుల పేరిట కాలేజీలు ఉన్నాయో అన్న వివరాలను రేపు బయట పెడుతానని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. కేవలం ఈడి దాడుల నుంచి బయటపడేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలో బీజేపీ పార్టీలో ఇమడలేకపోతున్నారని అన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉంటాయని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నకల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నమ్మకం పెరిగిందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులను గతంలో కంటే ముందుగానే ఎంపిక చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటు చేస్తుందన్న ధీమాను రేవంత్ రెడ్డి వ్యక్తంచేశారు. సమావేశంలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, జెడ్పీ ప్లోర్ లీడర్ సింగి రెడ్డి హరివర్దన్ రెడ్డి,టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర జంగయ్య యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ కు సన్మానం..
తూంకుంటలోని జిల్లా ప్రెస్ క్లబుకు తొలిసారిగా వచ్చిన పీసీసీ రేవంత్ రెడ్డిని జిల్లా జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు టి.మల్కయ్య ఆధ్వర్యంలో రేవంత్ కు పూలబోకే అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి పలుసమస్యలను తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వ మేర్పడి తొమ్మిదేళ్లు కావస్తున్నా.. ఇప్పటికి జిల్లాలో ఏ ఒక్క జర్నలిస్టుకు ఇళ్ల పట్టాలను ఇవ్వలేదన్నారు. జర్నలిస్టులకు మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికి ఇళ్ల పట్టాలను ఇస్తుందని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టలు కల్లెపల్లి రవిచంద్ర, రవికిరణ్ రెడ్డి, పన్నాల బాల్ రెడ్డి, రామక్రిష్ణ, క్రిష్ణాగౌడ్, రవీందర్, వెంకట్ రెడ్డి, యాదగిరి,శ్రీరాములు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.