Arrest :ఫేక్ డాక్యుమెంట్స్ తో ఖాళీ ప్లాట్ రిజిస్ట్రేషన్

by Kalyani |
Arrest :ఫేక్ డాక్యుమెంట్స్ తో ఖాళీ ప్లాట్ రిజిస్ట్రేషన్
X

దిశ, కుత్బుల్లాపూర్ : వృద్ధురాలైన ఓ ఒంటరి మహిళ ఖాళీ ఫ్లాట్ ను నకిలీ పత్రాలతో కాజేసి ఇతరులకు అమ్మిన నిందితులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బాచుపల్లి ఎస్ఐ సత్యం తెలిపిన వివరాల ప్రకారం ఎల్లమ్మ బండకు చెందిన సారాయి కృష్ణ, బహదూర్ పల్లి కి చెందిన కమ్మరి కుమార్ లు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రగతినగర్ వాసవి లే ఔట్ లోని సర్వే నెంబర్ 160/పీ, 182/పీ, 159/పీ లో గల ప్లాట్ నెంబర్ 135 లో 244-44 చదరపు గజాలు విస్తీర్ణం ప్లాట్ ఖాళీగా ఉన్న ప్లాట్ పై కన్నేశారు. ఈ ప్లాట్ కు వాస్తవ ఓనర్ లాగిశెట్టి జయశ్రీ. తాను స్థానికంగా లేకపోవడం, వృద్దురాలు కావడంతో ఆ ప్లాట్ ను కొట్టేసేందుకు పై నిందితులు పథకం రచించారు.

లాగిశెట్టి జయశ్రీ ఇతరులకు అమ్ముతున్నట్లుగా కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర అదే పేరుతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి జయశ్రీ స్థానంలో వేరే మహిళను ప్రవేశ పెట్టి ఆ ఖాళీ ప్లాట్ అమ్మినట్లుగా తాము కొన్నట్లుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు. అసలు విషయం తెలుసుకుని మహిళ కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ను సంప్రదించగా జయశ్రీ అమ్మినట్లుగా డాక్యుమెంట్ ఉందని ఎస్ ఆర్ ఓ తెలిపాడు. దీంతో తన ప్లాట్ ను తప్పుడు పత్రాలను తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి అమ్మినట్లుగా మార్చడం జరిగిందని వాపోతూ సదరు భాదిత మహిళ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఫోర్జరీ డాక్యుమెంట్ తో రిజిస్ట్రేషన్ చేసినట్లు నిర్దారించి సారాయి కృష్ణ, కమ్మరి కుమార్ లపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.



Next Story