కేసీఆర్‌ను ఖతం చేస్తున్నారు : ఈటల

by Disha Web Desk 23 |
కేసీఆర్‌ను ఖతం చేస్తున్నారు : ఈటల
X

దిశ, మేడ్చల్ బ్యూరో : పదేళ్ల పాలనలో మోదీని ఆశీర్వదిస్తుంటే.. కేసీఆర్ ను ఖతం చేశారని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.మొన్నటి వరకు అన్నింటిలో నెంబర్ వన్ బీఆర్ఎస్ చెప్పుకుందని, కానీ ఇప్పుడు ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు దిక్కు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. వరంగల్ సీటు వద్దని పారిపోతున్నారు. ఉన్న నాయకులు మెల్ల మెల్లగా జారిపోతున్నారని ఈటల ద్వజమెత్తారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కార్యకర్తల సమావేశంలో రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఊసరవెల్లిలా రంగులు మార్చతుర్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోడిని మా పెద్దన్న అన్న రేవంత్ ఇప్పుడెమో మోడీ గీడి అని మాట్లాడుతున్నాడన్నారు.

రేవంత్ నువ్వు చిన్న మనిషివి బిడ్డ.. అధికారం మీ అమ్మ నాన్న ఇచ్చింది కాదు..కేసీఆర్ ను ఓడ గొట్టేందుకు ప్రజలు ఇచ్చిందని,మోడీని విమర్శించిన వాళ్ల గతి ఏమైందో.. నీకు అదే గతి పడుతుందని ఈటల ఆగ్రహం వ్యక్తంచేశారు. మొన్న చిన్న ఎన్నికలని కాంగ్రెస్ కు ఓటు వేశామని, ఇప్పుడు పెద్ద ఎన్నికలు కనుక మోడికే వేస్తామని మల్కాజిగిరి ఓటర్లు అభయమిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల్లరా .. నాతోపాటు పనిచేసిన నాయకుల్లారా.. తెలంగాణ, దేశాభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని విజప్తి చేశారు. కాంగ్రెస్ పుట్టిన యూపీలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతైందని, ప్రపంచ దేశాలు మళ్ళీ మోడీయే ప్రధాని అవుతారని నమ్ముతున్నట్లు చెప్పారు.

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధాని మన నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. మోదీ హయాంలో 12 కోట్ల టాయిలెట్స్ కట్టించారన్నారు. ఈ పదేళ్ల కాలంలో బాంబుల మోతలు లేవు.. తెగిపడ్డ శరీరాలు లేవన్నారు. పుల్వామా దాడి చేస్తే.. సర్జికల్ స్ట్రైక్ చేసి బదలా తీర్చుకున్నారని వెల్లడించారు. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా నినాదం కాదు విధానం అని స్పష్టం చేశారు. డబ్బు మద్యంకి పాతర వేయాలని,ధర్మాన్ని గెలిపించాలని ఈటల పిలుపు నిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఆర్కే శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ వెంకటేష్, గోలీ మధుసుదన్ రెడ్డి, వీకే మహేష్, వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు శ్రవణ్, సునీత, టీమ్ సాయి, భాను ప్రకాష్, గిరి వర్ధన్ రెడ్డి, శ్రీనివాస్,ప్రసన్న, వాసం శెట్టి శ్రీనివాస్, నరసింహ గౌడ్, వద్ది సుబ్బారావు, ప్రీతం రామకృష్ణ, మరి పడిగే జగదీష్, గణేష్,లక్ష్మణ్ గౌడ్ లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed