బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సమస్యలు తీరాయి: మంత్రి మల్లారెడ్డి

by Kalyani |
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సమస్యలు తీరాయి: మంత్రి మల్లారెడ్డి
X

దిశ, మేడ్చల్ టౌన్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సమస్యలు తీరాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతణ దశాబ్ది ఉత్సవాల భాగంగా మేడ్చల్ పట్టణంలోని శ్రీ గార్డెన్ లో నిర్వహించిన నియోజకవర్గ విద్యుత్ విజయోత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో విద్యుత్ సమస్యలు తొలగిపోయాయని తెలిపారు. రైతులు సాగు చేసుకునేందుకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇంజనీర్ శ్రీనాద్ రెడ్డి విద్యుత్ విజయోత్సవ సభలో విద్యుత్ సంస్థల పాత్ర గురించి, సాధించిన విజయాలు ఏ రకంగా ఉన్నాయో వివరించడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంత ప్రజలే కాకుండా రైతులు విద్యుత్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.

ఈ విద్యుత్ విజయోత్సవ సభకు మంత్రి మల్లారెడ్డి రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నర్సింహారెడ్డి, డెజ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ వెంకటేష్, మేడ్చల్ జిల్లా రైతుబందు అధ్యక్షులు నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ మధుకర్ రెడ్డి, విద్యుత్ సూపరెండెంట్ ఇంజనీర్ శ్రీరామ్ మోహన్, ఏడీ సత్యనారాయణ రాజు, మేడ్చల్, శామీర్ పేట్ మండలాల ఎంపీపీలు రజిత రాజమల్లారెడ్డి, ఎల్లుబాయి బాబు, మేడ్చల్ , శామీర్ పేట్ జెడ్పీటీసీ లు శైలజ విజయానంద రెడ్డి, అనిత లాలయ్య, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఏఈలు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed