పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి

by Naresh |   ( Updated:2024-03-02 14:51:10.0  )
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో: నిర్ణీత గడువులోపు ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ నెల 9 వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ పై అవగాహన కార్యక్రమంలో ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరించాలి అనే విషయం పై ఆర్డీవోలకు, తహసీల్దార్లకు, ధరణి ఆపరేటర్లకు కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గడువులోపల పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ధరణి పోర్టల్ లో ఉన్న మాడ్యూల్స్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతి ఒక్క మాడ్యూల్ గురించి వివరంగా తెలియ పరచడం జరిగింది. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే ఫీల్డ్ ఇన్ఫెక్షన్ చేసి ఆన్లైన్‌లోనే కాకుండా ఫైల్స్ రూపంలో కూడా నిర్వహించాలని తహసీల్దార్లను ఆదేశించారు. రిపోర్టులను పరిశీలించి సంబంధిత నివేదికలతో పూర్తిస్థాయిలో కలెక్టరేట్‌కు సమర్పించాలని అన్నారు. చాలా జాగరూకతతో పాటు వేగవంతంగా ఈ స్పెషల్ డ్రైవ్ను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్‌ఓ హరిప్రియ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed