- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ ఔషధాలు..
దిశ, పేట్ బషీరాబాద్ : ప్రముఖ ఫార్మసీ కంపెనీల పేరుతో నకిలీ ఔషధాలను తయారు చేస్తున్న కంపెనీ పై ఆకస్మిక తనిఖీలు చేసి పలు రకాల దొంగ మందులను స్వాధీనం చేసుకున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. దూలపల్లి రోడ్డు సెంట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న షెడ్ లో ఓ వ్యక్తి నకిలీ మందులను తయారు చేస్తున్నాడని పక్కా సమాచారంతో పేట్ బషీరాబాద్ పోలీసులు, డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అధికారులు కలిసి ఏకకాలంలో తనిఖీలు చేయగా తనిఖీలలో ప్రముఖ ఫార్మసీ బ్రాండ్స్ అయిన క్యాడ్డిల, డాక్టర్ రెడ్డీస్, అబౌట్ వంటి కంపెనీల బ్రాండ్ తో పలు రకాల మందులు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో నిందితులను అదుపులోకి తీసుకొని నకిలీ ఔషధాలతో పాటుగా బ్రాండ్ల పేరుతో చేస్తున్న ప్యాకింగ్ మెటీరియల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ ఏ పేర్లతో ఔషధాలు తయారు చేస్తున్నారు, నిందితులు ఎవరు తదితర అంశాల పై వివరాలు తెలియాల్సి ఉన్నది.