సామాజిక మార్పునకు నిరంతరం కృషి చేసిన మహానీయుడు నారాయనణ గురుదేవ్

by Sumithra |
సామాజిక మార్పునకు నిరంతరం కృషి చేసిన మహానీయుడు నారాయనణ గురుదేవ్
X

దిశ, అల్వాల్: అంతరాలు లేని సామాజిక మార్పుకోసం నిరంతరం కృషిచేసిన మహనీయులు నారాయణ గురుదేవ్ అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ నారాయణ ఎడ్యుకేషనల్ ఆండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ కానాజిగూడలో నారాయణ విద్వాభవన్ లో నిర్వహించిన 170వ నారాయణ గురుదేవ్ జయంతి మరియు ఓనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక మార్పుకోసం జీవితాంతం కృషి చేసిన మహానీయులను ఆదర్శంగా తీసుకుని నేటి విద్యార్థి యువజనులు ముందుకు పోవాలనీ కోరారు.

నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్రీయం ఎందరో మహానీయుల త్యాగఫలం అని మరువకూడదన్నారు. వారి అడుగు జాడల్లో కొంతైనా ముందుకు పోని ప్రయత్నం చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జగతి రాజ్, సువర్ణ కుమార్, జబీజు పులి కాలేదత్తు, సొసైటీ అధ్యక్షులు పవిత్రన్, విజయన్, మనోజ్, రమేష్, హరిదాస్, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed