- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు హర్షవర్ధన్ రెడ్డికే: నందికంటి
దిశ ప్రతినిధి, మేడ్చల్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డికే మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి ఆయనకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ మద్దతు ప్రకటించడం గమనిచవలసిన విషయం. ఈ నెల 13న ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ బుధవారం అల్వాల్ లోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ఉపాధ్యాయులకు తెలియని విషయం కాదని, అందువల్ల విజ్ఞులైన ఉపాధ్యాయులు ఈసారి జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు ఎంతో మందిని ఐఏఎస్ అధికారులుగా తీర్చిద్దటమే కాకుండా, సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని నంది కంటి శ్రీధర్ పేర్కొంటూ, లాబీయింగుల పేరుతో ఉపాధ్యాయులను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, విజ్ఞాన వంతులైన ఉపాధ్యాయులు సరైన ఆలోచన చేసి, ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థించారు.
రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారానికి వస్తుందని నందికంటి శ్రీధర్ పేర్కొంటూ, కాంగ్రెస్ అధికారానికి రాగానే సీపీఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేస్తుందనీ చెప్పారు. అలాగే, ఉపాద్యాయ పోస్టులను ఖాళీగా ఉంచకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేయటమే కాకుండా పీఆర్సీని, వేతనాలను సరైన సమయంలో చెల్లించేలా చూస్తామన్నారు. కాంటాక్ట్ పోస్టులను పర్మినెంట్ చేయటం, నెల వారీగా పదోన్నతులు, బదిలీలు జరిగేలా చర్యలు తీసుకుంటామనీ, తద్వారా ఉపాధ్యాయుల ఆత్మగౌరవం నిలబెట్టెలా కృషి చేస్తామనీ ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కృష్ణ గౌడ్, కార్యదర్శి సంతోష్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్ర శేఖర్, జీడి శ్రీనివాస్ గౌడ్, సీఎల్ యాదగిరి, ఏబీ బ్లాక్ ల అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, నాయకులు శ్రీనివాస్, ఎ. పవన్ కుమారులు పాల్గొన్నారు.