- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి ఎమ్మెల్సీని కలిసిన ఎమ్మెల్యే.. ఈ సారైన సంధి కుదిరేనా..?
దిశ ప్రతినిధి, మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు - ఎమ్మెల్యే వివేకానంద నేతల మధ్య విభేదాలు సమస్య కొలిక్కి వచ్చినట్లు ఉన్నది. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే వివేకానంద శంబీపూర్ రాజును ఆయన నివాసంలో కలిసి చర్చలు జరుపుతున్నారు. దీంతో ఇన్నాళ్లు సందిగ్ధంగా ఉన్న వీరి మధ్య విభేదాలకు శుభం కార్డు పడినట్లేనని భావిస్తున్నారు. శంబీపూర్ రాజు కలిసి చర్చలు జరపడంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద గెలుపు సులభతరంగా మారబోతుందని కార్యకర్తలు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి హరీష్ రావు చొరవతో..
గత రెండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందలు దూర దూరంగా ఉంటూ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అధిష్టానం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే వివేకానందకు కేటాయించిన అనంతరం వీరి ఇరువురి మీద అనేక వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం శంబిపూర్ రాజు స్వయంగా దండే ముడి ఎంక్లవేలో ఉన్న ఎమ్మెల్యే వివేకానంద ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్ళారు.
ఆ సమయంలో ఆయన లేకపోవడంతో ఎమ్మెల్సీ తిరిగి వెళ్లిపోయారు. అదేవిధంగా టిక్కెట్ కేటాయించిన తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీనీ కలవడానికి ఆయన నివాసానికి వెళ్లగా.. అప్పటికే ఆయన బయటకు వెళ్లిపోయారు. వీరి మధ్య కొనసాగుతున్న విభేదాలు మంత్రి హరీష్ రావు వద్దకు చేరగా మంత్రి చొరవతో ఆయన సమక్షంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
అన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్తారా..?
నియోజకవర్గంలో ప్రధాన అంశంగా మారిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వివాదం మంగళవారం నాడు వారి కలయికతో అంత క్లియర్ అయినట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఇన్నాళ్లు తారాస్థాయికి ఉన్న విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ఎన్నికల్లో పని చేస్తారా అనే అంశంపై కొద్దిమీర ప్రశ్నార్ధంగానే ఉన్నది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అనుచరులు, అభిమానులు సైతం ఎమ్మెల్యే వివేకానంద వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న నేపథ్యంలో వారిని కూడా ఎమ్మెల్యే వివేకానంద తన దారిలోకి తెచ్చుకున్నప్పుడే సమస్యకు పూర్తిగా పరిష్కారం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఫామ్ తెచ్చుకో ముందు చూద్దాం..
ఇరువురు నేతల కలిసిపోయారని మంగళవారం మాధ్యమాలలో పోస్టులు వచ్చినప్పటికీ మరొక వార్త కూడా కార్యకర్తల అభిమానులు గుసగుసలాడుకోవడం వినిపించింది. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మాట్లాడుకునే సందర్భంలో ఎమ్మెల్యే వివేకానంద తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కోరగా దానికి సమాధానంగా ఆయన "బీఫామ్ తెచ్చుకో ముందు చూద్దాం" అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో సంధి కుదిరిందా కుదిరినట్టేనా..? అనే మళ్లీ అనుమానాలు కలుగుతున్నాయి. కాగా రెండు గంటలుగా ఇద్దరు నేతల మధ్య న చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.