ఆటోలో అసెంబ్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే..

by Sumithra |
ఆటోలో అసెంబ్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే..
X

దిశ, కూకట్ పల్లి : ఆటో కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్ అన్నారు. ఈ రోజు ఉదయం కూకట్ పల్లి లోని ఆటో స్టాండ్ లో ఆటో కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ ఆటో కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని, రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల ఆటో కార్మికులు తీవ్రంగా నష్ట పోతున్నారని అన్నారు.

ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆదుకోవాలని, ఆత్మహత్య కు పాల్పడిన ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ లు డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తోటి ఎమ్మెల్యేలతో కలిసి ఆటోలో అసెంబ్లీకి వెళ్ళారు.

Advertisement

Next Story

Most Viewed