- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పండగ పూట ఎమ్మెల్యే సాయన్నకు పరాభవం..
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే సాయన్నకు పరాభవం ఎదురైంది. శనివారం మారేడ్ పల్లిలోని షెనయ్ గ్రౌండ్ లో ముగ్గుల పోటీలకు ఎమ్మెల్యే పిలుపునివ్వగా ఉదయాన్నే అక్కడికి చేరుకున్న మహిళలు ముగ్గులు వేశారు. కాగా ముగ్గుల పోటీల్లో ప్రతిభను కనబరిచిన మహిళలకు బహుమతులు ఇవ్వకుండా, కావాలనే బీఆర్ఎస్ కు చెందిన మహిళలకే బహుమతులు ఇచ్చారని ఆరోపిస్తూ పోటీల్లో పాల్గొన్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. కనీసం నీళ్లు, భోజన సదుపాయం కూడా కల్పించలేదని వాపోయారు. బీఆర్ఎస్ నాయకులు ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా అవమానంతో రగిలిపోయిన మహిళలు నాయకులకు భోగి పండగ పూట చుక్కలు చూపించారు. మహిళలు అంటే మీకు ఇంత చిన్న చూపా? మా ఓట్లతో గెలిచి మమ్మల్ని పట్టించుకోరా? అని నిలదీశారు. ఎమ్మెల్యే సాయన్న వారి బృందం వెళ్లి పోవాలని చూసినా, మహిళల ఆగ్రహానికి, వారి శాపనార్థాలకు గురి కాక తప్పలేదు.