మేడ్చల్ టూ సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం..

by Kalyani |
మేడ్చల్ టూ సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం..
X

దిశ,మేడ్చల్ టౌన్: వందే భారత్ సెమి హై స్పీడ్ రైలును సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం విధితమే. అనంతరం పరేడ్ గ్రౌండ్ వేదికగా పలు ఎంఎంటీఎస్ సర్వీసులను మోడీ ప్రారంభించారు. ఆ సర్వీసులలో భాగంగా మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు ప్రధాని జెండా ఊపటంతో ప్రారంభమైంది. శనివారం మేడ్చల్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్ మొదటి సర్వీస్ ను మేడ్చల్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రయాణికులతో రైలు బయలుదేరింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, కౌన్సిలర్ బత్తుల శివకుమార్ యాదవ్, కోఆప్షన్ సభ్యులు గీత మధుకర్, రైల్వే ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

ఎంఎంటీఎస్ రైలుకు ప్రత్యేక పూజలు..

దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్ణాత్మకంగా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఎంఎంటీఎస్ రైలును శనివారం మేడ్చల్ లో రైల్వే అధికారులు ప్రారంభించారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో గౌడవెల్లి గ్రామంలో రైల్వే స్టేషన్ లో గ్రామ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి జి సురేందర్, ముదిరాజ్ ఎంఎంటీఎస్ రైలును గ్రామం తరపున స్వాగతం తెలియజేసి గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎంఎంటిఎస్ రైల్లో ఉన్న ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Next Story