- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గాజులరామారంలో భారీగా కూల్చివేతలు.. రోడ్డున పడ్డ పేద కుటుంబాలు
దిశ, కుత్బుల్లాపూర్ : మేడ్చల్ జిల్లా గాజులరామారం లో మంగళవారం భారీగా రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో భూ కబ్జాల పై ఆరోపణలు వస్తున్న దృష్ట్యా ఉదయం నుండే భారీగా కూల్చివేతలు చేపట్టారు. వందకు పైగా పోలీస్ బందోబస్తు, మూడు మండలాల రెవెన్యూ సిబ్బంది, 12 జేసీబీలతో అధికారులు మాస్ డిమాలిషన్ నిర్వహించారు. సర్వే నెంబరు 342, 329, 307లలో వెలసిన వందలాది అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. సర్వే నెంబర్ 342లో సుమారు 500 ఇళ్లను నేలమట్టం చేశారు. 329 లోని ఐదు రూములు , 307 లోని గాలి పోచమ్మ బస్తీ లో సుమారు వంద ఇళ్లు కూల్చివేశారు.
ఈ కూల్చివేతలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, దుండిగల్ పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది బందోబస్త్ నిర్వహించారు.ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలు అధికారులు కూల్చడంతో కాయ కష్టం చేసి, బంగారం అమ్మి ప్లాట్లు కొన్న నిరుపేదలు రోడ్డున పడ్డారు.తమ ఇళ్లను కూల్చవద్దంటూ రెవిన్యూ అధికారులను, పోలీసులను మహిళలు వేడుకున్నారు. మధ్యాహ్నం వరకు ఇన్ని నిర్మాణాలు కూల్చివేయగా ఇంకా రెవెన్యూ బృందాలు టీమ్‌లుగా విడిపోయి కూల్చివేతలు కొనసాగిస్తున్నాయి. ఈ కూల్చివేతలలో మల్కాజ్గిరి ఆర్డీఓ మల్లయ్య, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ సంజీవరావు పాల్గొన్నారు.