కల్తీ అల్లంవెల్లుల్లి తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్..

by Sumithra |
కల్తీ అల్లంవెల్లుల్లి తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్..
X

దిశ, ఉప్పల్ : రామంతపూర్ లో నకిలీ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం పై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు దాడి చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నాంపల్లి అగాపురకి చెందిన మహమ్మద్ ఆఫ్తార్ గత కొంత కాలంగా న్యూ నేషనల్ పేరుతో రామంతపూర్ లోని మూసి ప్రాంతంలో మానవాళికి హాని కలిగించే రసాయనాలు కలుపుతూ కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాడు.

విశ్వసనీయమైన సమాచారం మేరకు మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. మహమ్మద్ అప్తార్ ని అరెస్టు చేసి కల్తీ అల్లంవెల్లుల్లిలో కలిపే రసాయనాలు టైటానియం పొడి 200 గ్రాములు, సిట్రిక్ ఆసిడ్ 30 కేజీలు, తయారు చేసిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు 1200 కేజీలు స్వాదీనం చేసికొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. దీంతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉప్పల్ పోలీసులు.

Advertisement

Next Story

Most Viewed