- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఐటీ సోదాలతో నిర్మానుష్యంగా మారిన Malla Reddy University
దిశ, దుండిగల్: కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పై ఐటీ శాఖ మెరుపు దాడులు సంచలనంగా మారాయి. మంత్రి మల్లారెడ్డి కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, అల్లుళ్ళ నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి. 50 టీమ్స్ సహాయంతో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపుతుంది. మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
కొంపల్లిలో పాలం మెడోస్‌లో ఆయన నివాసముండే 169 వ విల్లాలో ఉదయం 7 నుండి సోదాలు జరుగుతుండగా మహేందర్ రెడ్డి ఐటీ అధికారులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. మైసమ్మగూడ,మేడ్చెల్ ప్రాంతాల్లో విస్తరించి వున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నాయి. మల్లా రెడ్డి యూనివర్సిటీ ,మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో సోదాలు చేస్తున్న ఐటీ శాఖ అధికారులు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ సదరు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.