- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
lands Calculation : పక్కాగా ప్రభుత్వ భూముల లెక్క
దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రభుత్వ భూముల లెక్క(Account of Government Lands)లపై రెవెన్యూ అధికారులు కుస్తీ పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి. వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. మిగిలి ఉన్న ప్రభుత్వ భూముల సంరక్షణ విషయంపై మేడ్చల్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం (Medchal District Revenue Authority)దృష్టి సారించింది.
సర్కారీ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి..? గతంలో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల పరిస్థితి ఏంటి..? అనే విషయాలపై ప్రభుత్వం నివేదిక కోరింది. దీంతో జిల్లా పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు.. వాటిలో కబ్జా అయినది ఎంత మేర ఉన్నాయి..? తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఆస్కారం ఉన్న భూములు ఏవి.. ? అనే విషయాలపై రెవెన్యూ విభాగం నివేదికలు సిద్ధం చేస్తుంది.
లెక్కలు పక్కా..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో మొత్తం 12 మండలాలు (12 Mandals)ఉన్నాయి. ఆయా మండలాల్లో ఐదు వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ భూముల్లో ఎన్ని ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి..? ఎన్ని ఎకరాలు కబ్జాకు గురయ్యాయి..? కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకునేందుకు ఆస్కారం ఉన్న భూములు ఎంత మేర ఉన్నాయి..? అనే అంశాలను పరిగణలోకి తీసుకొని మరో నివేదికను తయారు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో దాదాపుగా 35 శాతం భూములు కబ్జాకు గురైనట్లు అంచనాకు వచ్చారు. ఆయా వివరాలను క్రోడీకరిస్తూ సమగ్ర సర్వే చేసి నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందించనున్నది రెవెన్యూ యంత్రాంగం.
పారిశ్రామిక వాడల అభివృద్ధిపై దృష్టి
ఉపాధి కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఉన్న ప్రభుత్వ భూమి లెక్కలు తీసి ఆయా భూములను పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేటాయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కండ్లకోయ గేట్వే ఐటీ పార్క్, ఉప్పల్ జెన్ ప్యాక్ ఐటీ పార్క్ తరహాలో ఇతర ప్రభుత్వ భూముల్లో పరిశ్రమల అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతుంది.
అసైన్డ్ భూములు సైతం...
కేవలం ప్రభుత్వ భూములు మాత్రమే కాకుండా అసైన్డ్ భూముల విషయంలో కూడా రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెడుతుంది. గతంలో పేదలకు కేటాయించిన భూముల పరిస్థితిపై ఆరా తీస్తుంది. సాగు చేసుకుంటానికి ఇచ్చిన భూములు నిజంగా సాగు చేసుకుంటున్నారా..? లేదా విక్రయించారా..? లేదా నిరుపయోగంగా అలాగే ఉంచారా..? అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంది.
ఇందులో భాగంగానే కుత్బుల్లాపూర్ దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధిలోని సర్వే నెంబర్ల 453,454 లలో ఉన్న అసైన్ భూములను అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇప్పటి వరకు 12 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను పేదలకు కేటాయించడం జరిగింది. అత్యధికంగా మేడ్చల్ మండలంలో 4 వేల ఎకరాల వరకు అసైన్ భూములను పేదలకు కేటాయించినట్లు తెలుస్తుంది.
సంరక్షణ బాధ్యత హైడ్రాకే : విజయేందర్ రెడ్డి, మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్
ఇప్పటివరకు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల సంరక్షణను రెవెన్యూ అధికారులు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా ఇకపై ఆ బాధ్యతలను స్వీకరించనుంది. ఇప్పటికే జిల్లాలో ఉన్న కీసర, మల్కాజ్గిరి రెవెన్యూ డివిజన్లలో మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల నివేదికను హైడ్రాకు అందజేయనున్నాం. హైడ్రానే ఇకపై వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోనుంది. ప్రభుత్వ భూముల గుర్తించి, వాటి లొకేషన్ స్కెచ్, జియో కోఆర్డినేట్స్ వంటి పూర్తి సమాచారం హైడ్రాకు అందజేయనున్నాం.