- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం..
by Kalyani |
X
దిశ, మేడ్చల్ టౌన్: అక్రమ సంబంధం ఒక మహిళ హత్యకు కారణం అయిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం పరిధిలో ఈ నెల 9వ తేదీన గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు కేసు నమోదు అయిన విషయం విదితమే. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో మృతురాలి ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు తెలిపారు.
ఒడిషా రాష్ట్రం నుంచి వలస వచ్చిన ధాత్రి సింగ్(22), షేక్ చాంద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని గర్భం దాల్చినట్లు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో చాంద్, అతని భార్య పంకిజా, స్నేహితులు అజీమ్ షా, మందాకిని సాయంతో యువతిని అడ్డు తొలగించుకోడానికి పథకం ప్రకారం చేతులు కట్టి ఉరి వేసినట్లు పోలీసుల విచారణలో తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story