- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వాసుపత్రిలో అక్రమ పార్కింగ్..
దిశ, ఘట్కేసర్ : ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ అక్రమ పార్కింగ్ కు నిలయంగా మారిపోయింది. ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తమ మోటార్ సైకిళ్ళు పార్క్ చేసి.. తిరిగి సాయంత్రం వచ్చి తమ మోటార్ సైకిళ్ళు తీసుకెళ్తున్నారు. ఇక్కడ పార్క్ చేయొద్దని ఎంత చెప్పినా వినకుండా ఆవరణలో పార్క్ చేసి వెళ్లిపోతున్నారని ఆసుపత్రి సిబ్బంది వాపోతున్నారు. వైద్యపరీక్షల కోసం వాహనాల పై వస్తున్న వారు ఎవరో.. ఇక్కడ వాహనాలు పెడుతున్న వారు ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని వాచ్మెన్ చెప్పారు.
నిత్యం 400 పైగా రోగులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చి వెళుతుంటారు. బుధవారం, గురువారాల్లో గర్భిణీ స్త్రీలకు పరీక్షలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలతో ఆసుపత్రి రద్దీగా ఉంటుంది. మోటార్ సైకిళ్ళ అక్రమ పార్కింగ్ వల్ల అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంటుందని స్థానికులు తెలిపారు. అక్రమ పార్కింగ్ పై వైద్యశాఖ ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.