బీసీలకు రాజ్యాధికారం కావాలంటే రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

by Aamani |
బీసీలకు రాజ్యాధికారం కావాలంటే రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
X

దిశ,మల్కాజిగిరి : బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే రిజర్వేషన్ల శాతాన్ని పెంచి వాటిని అమలు చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. గురువారం మల్కాజిగిరి సర్కిల్ వినాయక నగర్ డివిజన్ జి ఎస్ ఆర్ గార్డెన్ లో నియోజకవర్గం బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ ప్రథమ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం కావాలంటే బీసీలందరూ కలిసికట్టుగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు. ఓటు వేసే సమయంలో తన ఓటును బీసీలకు వేసినట్లయితే బీసీలకు రాజ్యాధికారం వస్తుందన్నారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలోని బీసీల ఐక్యత కోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలన్నారు.హైకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు కుల గణన ప్రభుత్వం అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి, గున్నాల సునీత శేఖర్ యాదవ్, బీసీ సీనియర్ నేత పిట్ల మోహన్ రాజ్, మల్కాజిగిరి నియోజకవర్గం బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు కామర్ల అయిలన్న, ప్రధాన కార్యదర్శి రొయ్యల కృష్ణమూర్తి, కోశాధికారి బత్తిని నరసింహ గౌడ్, ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, కార్యదర్శులు చేకూరి రామ్మోహన్ కురుమ, అప్పల శ్రీనివాస్, కాసర్ల నాగరాజు, ప్రచార కార్యదర్శులు బండ లక్ష్మీనారాయణ, పిట్టల భాస్కర్, జోగు శ్రీనివాస్, సుక్క సుధాకర్, వంగరి శ్రీనివాస్ పేపర్, గోపాల గౌడ్, దొమ్మాటి సంతోష్, సంపత్, రాములు బీసీ నాయకులు పంకర్ల కుమారస్వామి, ఉప్పరి సాయికుమార్, వేములకొండ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed