రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని మొదట చెప్పింది నేనే : మాజీ మంత్రి మల్లారెడ్డి..

by Aamani |
రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని మొదట చెప్పింది నేనే :  మాజీ మంత్రి మల్లారెడ్డి..
X

దిశ,కంటోన్మెంట్ : రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని మొదట చెప్పింది నేనే నని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. 2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయం లో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో స్వయంగా రేవంత్ రెడ్డి తో ఈ వ్యాఖ్యలు చేసినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కంటోన్మెంట్ జయనగర్ కాలనీలో ని తన కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో చేరేది లేదని ఎమ్మెల్యే గానే ఉంటూ, మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు రానున్న ఐదు సంవత్సరాలు సేవ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

గతంలో రేవంత్ రెడ్డి పై తొడగొట్టి చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయపరంగానే చేసినవని, వ్యక్తిగతంగా కాదన్నారు. తామంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎంతో స్నేహంగా మెలిగే వారమన్నారు. తన కుమారుడు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడని, అతను ఏ పార్టీ నుంచి పోటీ చేసిన తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. సమావేశంలో పార్టీ నేతలు టింకు గౌడ్, అజయ్ తదితరులున్నారు.

Next Story

Most Viewed