బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు..

by Sumithra |
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు..
X

దిశ, శామీర్ పేట : కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్నారని మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ఆదివారం శామీర్ పేట మండల కేంద్రంలోని ఎన్పీజీ వెంచర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నుండి బాబాగూడ, లాల్ గడి మలక్ పేట గ్రామాల నుంచి పెద్దఎత్తున నాయకులకు కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పట్నం సునీత రెడ్డి, వజ్రేష్ యాదవ్, హరి వర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని వారు అన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు కడుపులో పెట్టుకొని చూసుకుంటామని అన్నారు. పార్టీలోకి వస్తున్న నాయకులు ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ పార్టీ ప్రభుత్వ కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అద్యక్షులు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు వైయస్ గౌడ్, తూముకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు కిషోర్ యాదవ్, కంఠం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీలు మహేందర్ యాదవ్, సాయి, విలాసాగరం అశోక్, బండి రామిరెడ్డి, దాసరి కృష్ణారెడ్డి, సింగిరెడ్డి దీపక్ రెడ్డి, సింగిరెడ్డి బబుల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed