- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హస్తం ఆపరేషన్ ఆకర్ష్.. ఒకే రోజు ముగ్గురు కార్పొరేటర్ల చేరిక
దిశ, మేడ్చల్ బ్యూరో/మేడిపల్లి: హస్తం పార్టీ ఆపరేషన్ జోరు పెంచడంతో గులాబీ దళం విలవిలలాడుతోంది. మేడ్చల్ అసెంబ్లీ నియోజవకర్గంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, గుర్తింపు ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా పీర్జాదిగూడ కు చెందిన ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారుతుండడంతో నియోజకవర్గంలో ‘కారు’ సీట్లన్నీ ఖాళీ అవుతున్నాయి. పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆ పార్టీ ని వీడి కాంగ్రెస్ బాట పడుతుండడం చర్చనీయాంశంగా మారింది.
పీర్జాదిగూడ మేయర్‌పై గురి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి మేయర్‌పై గురి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి మేయర్ జక్కా వెంకట్ రెడ్డి కీలకంగా వ్యహరించారని, అతన్ని ఎలాగైనా పదవి నుంచి దించి, పైచేయి సాధించాలని పక్కా ప్లాన్ తో వెళ్తున్నారు. గతంలో ఓసారి అవిశ్వాసానికి ప్రయత్నించి సరిపడా కార్పొరేటర్ల బలం లేకపోవడంతో కాం గ్రెస్ నేతలు విఫలమయ్యారు. ఈసారి మాత్రం పూర్తి బలం పెంచుకొని మేయర్ ను పదవి నుంచి దింపాలని ప్లాన్ చేస్తు న్నారు. సోమవారం బోడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ అదే జోరుగో పీర్జాదిగూడ మేయర్ పీఠంను తన ఖాతాలో వేసుకోవాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగం గానే మాజీ ఎమ్మెల్యేలు మైనం పల్లి హన్మంతరావు, మలిపెద్ది సుధీర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షు డు తోటకూర వజ్రేష్ యాదవ్ సోమవారం పీర్జాదిగూడకు చెం దిన ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బండి రమ్య సతీష్ గౌడ్, అలువాల దేవేందర్ గౌడ్, కౌడే పోచయ్యను పార్టీలో చేర్చుకున్నారు.
ఒక్క సీటు దూరంలో..
పీర్జాదిగూడను ‘హస్త’ గతం చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కార్పొరేషన్ కార్పొరేటర్ల సంఖ్య 26. ముగ్గురు కాం గ్రెస్‌లో చేరికతో ఆ సంఖ్య 17కు చేరింది. ప్రస్తుత మేయర్ వెంకట్ రెడ్డి వర్గం లో 9 మంది మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే ఒక్క కార్పొరేటర్ మద్దతు అవసరం. రాబోయే రెండు, మూడు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొందరు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరడం ఖా యమని నాయకులు చెబుతున్నారు. దీనికి తోడు మే యర్ పీఠాన్ని దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఒక్క కార్పొరేటర్ ను తమ పార్టీలోకి రప్పించేందుకు నయానో.. భయానో ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేళ మేయర్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే జవహర్ నగర్, బోడుప్పల్ తో మూడు కార్పొరేషన్లు హస్తం ఖాతాలోకి వెళ్లిపోనున్నాయి.