- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరు పిల్లలతో తండ్రి అదృశ్యం
దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : తండ్రి ,ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయిన్ పల్లి లో చోటు చేసుకుంది. ఎస్.ఐ.నాగేంద్ర బాబు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా ఓల్డ్ బోయిన్ పల్లి లో నివాసం ఉంటున్న సుమన్ కుమార్ (39)కు భార్య అల్పన, కుమారుడు, కూతురు సాత్విక్(13), శాన్వి(9) ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో కొన్ని రోజులుగా భార్య అల్పన , సుమన్ కుమార్ కు తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మాటమాట పెరిగి గొడవ తారా స్థాయికి చేరింది. దీంతో మనస్తాపం చెందిన సుమన్ కుమార్ ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అయితే భర్త రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాక, బంధువులు ఇంటికి వెళ్లక పోవడం, ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన భార్య బోయిన్ పల్లి పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.