- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలపై వీడని ఉత్కంఠ.. కనిపించని ఎన్నికల సందడి
దిశ, కంటోన్మెంట్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బోర్డు పాలక మండలి ఎన్నికలు ఆపేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. ఎన్నికలు వాయిదా వేయాలని ఒకవైపు కోర్టులో కేసులు.. మరోవైపు బోర్డు నామినేటెడ్ సభ్యుల లాబీయింగ్ తో అసలు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా..? వాయిదా పడుతాయా..? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.ఎన్నికలు వద్దంటూ జీహెచ్ఎంసీలో బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ కంటోన్మెంట్ వికాస్ మంచ్ హైకోర్టును ఆశ్రయించగా, బోర్డు నామినేటెడ్ సభ్యుడు తన అనుచర గణం తో కోర్టులో 25కు పైగా రిట్ లు దాఖలు చేయించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
వికాస్ మంచ్‌కు చుక్కేదురు..
కంటోన్మెంట్‌లో ఓట్ల తొలగింపు.. బల్దియా లో వీలిన ప్రక్రియను ఆధారం చేసుకుని కంటోన్మెంట్ వికాస్ మంచ్ హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాలుగేళ్ల క్రితం రక్షణ శాఖ, ఎయిర్ పోర్ట్ అథారిటీ ల స్థలాల్లో ఉన్న బస్తీల కు సంబంధించి 28,123 ఓట్లను తొలగించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు 2 లక్షలుంటే.. బోర్డు ప్రత్యేక ఓటరు జాబితాలో 1.32 లక్షలకు ఎలా కుదిస్తారని మంచ్ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
అదేవిధంగా కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్రం ఇటీవల కమిటీ వేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను నిలిపివేసి, కంటోన్మెంట్ ను విలీనం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించినట్లు వికాస్ మంచ్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే గురువారం హైకోర్టులో వికాస్ మంచ్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. పిటిషన్ బెంచ్ పైకే రాలేదని సమాచారం.
దీంతో వికాస్ మంచ్ పిటిషన్ విచారణ ను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది. అదేవిధంగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామక్రిష్ణ తన అనుచరులతో హైకోర్టులో రిట్‌లు దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ అడ్డంకులు దాటుకోని కంటోన్మెంట్‌లో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా..? లేదా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
అయోమయంలో ఆశావహులు..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో తలపడేందుకు ముందుకు వెళ్లాలా..? ఇంకా కొన్ని రోజులు వేచి చూడాలా..? అని తేల్చుకోలేకపోతున్నారు.కంటోన్మెంట్ యాక్ట్ లో ఒక్కో సెక్షన్ లో ఒక్కో రకంగా ఉన్నందున ఎన్నికలు జరుగుతాయా..? లేదా అనే అనుమానం వారిని వెంటాడుతోంది. ది కంటోన్మెంట్ యాక్ట్ 2006, సెక్షన్ ప్రకారం.. జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సూచిస్తుండగా.. ది కంటోన్మెంట్ ఎలక్ట్రోరల్ రూల్స్ 2007, సెక్షన్ 20 లో పేర్కొన్న మేరకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయవచ్చు.
జాతీయ విపత్తులు సంభవించినప్పుడు గానీ, అహింస చెలరేగినప్పుడు గాని, అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపాలిటీల ఎన్నికల తేదీలకు అడ్డంకిగా మారినప్పుడు మాత్రమే ఈ సెక్షన్‌ను వినియోగించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో, కంటోన్మెంట్‌లో ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. దీంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశం లేదని మరికొందరు వాదిస్తున్నారు. విలీన ప్రక్రియకు, ఎన్నికలకు అసలు సంబంధమే లేదని, కొత్త బోర్డు కొలువుదీరిన తర్వాతనే విలీన తీర్మానాలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.