- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Etela Rajender : హైడ్రా వచ్చి పిచ్చోడి చేతిలో రాయిల అయ్యింది : ఎంపీ ఈటల
దిశ,మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ లో వక్స్ బోర్డు చట్ట సవరణ కోసం బాధితులతో మాట్లాడి, వారిసమస్యలను తెలుసుకోవాలని జేపీసీ కమిటీ మెంబర్,మహబూబ్ నగర్ పార్లమెంట్ మెంబర్ డీకే అరుణ అన్నారు. శనివారం బోడుప్పల్ లో పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు.వక్ఫ్ బోర్డు బాధితుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ కొన్ని ఏండ్లనుండి స్థలం కొనుక్కుని, లోన్ తీసుకుని ఇండ్లు కట్టుకుని, ఇంటి టాక్స్ లు కడుతూ,సొంత ఇల్లు కల నెరవేరానుందని అనుకునే లోపే ఈ భూమాలాన్ని వక్స్ బోర్డు కిందకు వస్తాయని తెలియగానే అప్పటినుండి బాధితులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారన్నారు.
పార్లమెంట్ లో వక్ఫ్ చట్టం ప్రవేశపెట్టగా జాయింట్ కమిటీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వక్ఫ్ సమస్యలపై ఈ నెలాఖరు వరకు నివేదిక ఇవ్వాలని చెప్పగా ఈ సందర్భంగా బోడుప్పల్ చేరి సమస్యలకు వినతిపత్రాలు తీసుకున్నానని త్వరలో కమిటీకి సమర్పిస్తానని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు తెలంగాణలో ఈ సమస్యతో ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో గుర్తించి ముఖ్యమంత్రిగా సూచనలు,సలహాలు ఇవ్వాలని కోరారు.వక్స్ బోర్డు సమస్య ఒక కులానిది కాదని, అన్ని కులాలవారు ఇందులో బాధితులు ఉన్నారని, ముస్లిం లో కూడా పేదవారికి ఈ భూములు ఉపయోగ పడటం లేదని, వక్స్ బోర్డు సంపద ఎక్కడకుపోతుందని సరైన నివేదిక ఇవ్వాలనే ఈ కమిటీని ఏర్పాటుచేసారని కమిటీ నివేదిక తో త్వరలోనే వక్ఫ్ సమస్య తొలగిపోతాయని డీకే అరుణ అన్నారు.
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. హైడ్రా వచ్చి పిచ్చోడి చేతిలో రాయి అని.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా బోడుప్పల్ వక్ఫ్ బాధితులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వేల కుటుంబాలు ఈ భాదను అనుభవిస్తున్నారని, ప్రజల ఉసురు పోసుకుని ప్రభుత్వాలు గల్లంతయ్యాయని అన్నారు. ప్రజలు ఓటు వేసి గెలిపించింది వారి బాధలు తీర్చడానికి తప్ప, వారి ఇండ్లు కూల్చే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. హైడ్రా వచ్చినప్పటినుండి ఎప్పుడు ఏమవుతుందో, ఎవరి ఇండ్లు ఎప్పుడు కూల్చివేస్తారో అని పిచ్చోడి చేతిలో రాయిలా అయిపొయింది అని అన్నారు. ప్రజల సమస్య పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదే అని, గత ప్రభుత్వం 118 జీ ఓ వల్ల కొందరి ఇండ్లు శాశ్వతంగా అమ్ముకోలేని విధంగా అయ్యాయని, వక్ఫ్ సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్నాయని అన్నారు.ప్రజల జీవితాలతో రాజకీయ నాయకులు చెలగాటం ఏడవద్దని మీ సభ మీరు కొట్లాడటానికి ఉందా లేక ప్రజల సమస్యలు మాట్లాడటానికి ఉందా సమస్యను అసెంబ్లీ లో పెట్టాలని అన్నారు. వక్ఫ్ బాధితులు బ్యాంక్ లకు లోన్ కోసం వెళ్తే ప్రభుత్వం మారితే మరల ఏ కండిషన్స్ పెడతారో అని బ్యాంకు వాళ్లు లోన్ ఇవ్వడానికి భయపడుతున్నారని అన్నారు. డీకే అరుణ తో సహకారం అందిస్తూ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని అన్నారు.