- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడుగు బలహీన వర్గాలకు బీజేపీనే అండదండలు : ఈటల
దిశ,అల్వాల్ : ఎస్సీల అభివృద్ధికి అన్ని వేళల అండగా ఉంటానని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం అల్వాల్ వీబీఆర్ గార్డెన్ లో ఎస్సీ మోర్చా నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటానని దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం అయిన మల్కాజిగిరిలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూసుకుందామని కార్యకర్తలనుద్దేశించి అన్నారు.
నానాటికి కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు విశ్వసం తగ్గుతుందని మూడవ సారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయం పేదలందరు అభివృద్ధి చెందడం నిజమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన రాజేందర్ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్, మేడ్చల్ జిల్లా ఎస్సీ మురళి కృష్ణ, కరుణాకర్,లవ కుమార్,నాగరాజు, రమేష్, యాదగిరి, జైపాల్, మల్లికార్జున్ గౌడ్,మాణిక్య రెడ్డి,లక్ష్మణ్, పద్మిని,సుజాత తదితరులు పాల్గొన్నారు.