- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్..వాసవి నిర్మాణ సంస్థపై దర్యాప్తు ప్రారంభం..
దిశ, కూకట్పల్లి: వడ్డించే వాడు మనోడైతే చాలు ఏ బంతిలో కూర్చుంటే ఏముంది మనకు రావలసింది వచ్చేస్తుంది అన్న చందంగా తయారైంది కూకట్‌పల్లిలో వాసవి నిర్మాణ సంస్థ భారీ నిర్మాణాల కథ. ఒక వైపు నాలా కన్వర్షన్ కానే లేదు, జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చేసింది. ధరణిలో అప్డేట్ కానేలేదు. వ్యవసాయ భూములలో ఎంచక్క భారి టవర్ నిర్మాణ పనులు చక చక ముందుకు సాగుతున్నాయి. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో రెండు వందల ఎకరాల చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంటే అధికారులు మీన వేషాలు వేస్తున్నారు. ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలోని భూములలో యధేచ్చగా భారీ టవర్ల నిర్మాణాలను నిర్మించుకునేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా దగ్గరుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఉంది వాసవి నిర్మాణల కథ చూస్తుంటే.
అనుమతులు ఎలా ఇచ్చారు..
కూకట్పల్లి మైసమ్మ చెరువు సమీపంలో వాసవి నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న 9 టవర్లకు సంబంధించి ఆగస్టు 9, 2023లో జీహెచ్ఎంసీ నుంచి పర్మిట్ నంబర్ (2859/GHMCIKKPI2023-BP) అనుమతులు తీసుకున్నారు. ఇందులో 3 సెల్లర్లు + 1 గ్రౌండ్ + 29 ఫ్లోర్స్ గా ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, ఎచ్, ఐలు గా 9 బ్లాక్‌ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. కాగా వాసవి నిర్మాణ సంస్థ మూసాపేట్ గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 49/A, 50A&B, 51A,B,C&D, 52 A,B&D, 53 A&B, 54/A, B, C, D, E&G, 55 A&B, 56 A&B, 57 A&B, 66, 67, 68 A&B, 69, 70, 73, 76, 77, 78 A&C, 78 D&B, 79, 82, 83, 85, 86, 87/A, B & C, 88/B, C, D&F, 89/A, B, C, D&E, 90, 91, 99/Α లలోని భూములలో నిర్మాణాలు చేపడుతుంది. ఇదిలా ఉంటే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న సర్వే నంబర్లలో చాలా వరకు ఇంకా ధరణిలో వ్యవసాయ భూములుగానే దర్శనమిస్తున్నాయి. నాలా కన్వర్షన్ కాకుండానే జీహెచ్ఎంసీ అధికారులు ఏ ప్రాతిపాదికన అనుమతులు ఇచ్చారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇంటెలిజెన్స్ అధికారుల విచారణ..
వాసవి నిర్మాణ సంస్థ మైసమ్మ చెరువు ఎఫ్టిఎల్, బఫర్ జోన్ భూములలో భారీ టవర్ల నిర్మాణాన్ని ప్రారంభించిన విషయాన్ని దిశ పత్రిక ప్రచురించడంతో సైబరాబాద్ ఇంటెలిజెన్స్ అధికారులు వాసవి నిర్మాణ సంస్థ నిర్మాణాలు, అనుమతుల విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. అనుమతులు ఎలా పొందారు. నాలా కన్వర్షన్ కాకుండానే అనుమతులు జారి చేసిన విషయంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. మార్టిగేజ్ ఎక్కువ పర్సంటేజ్ కట్టుకున్నట్టు, గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పెద్దలతో వావసి నిర్మాణ సంస్థ యాజమాన్యానికి ఉన్న సంబంధాలు, లావా దేవీల కారణంగానే అనుమతులు ఇచ్చే సమయంలో జీహెచ్ఎంసీ అధికారులు కండ్లకు గంతలు కట్టుకుని ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా వాసవి నిర్మాణ సంస్థ పై పూర్తి స్థాయి విచారణ చేపట్టి మైసమ్మ చెరువును కాపాడాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.