- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబ్రక దబ్రా @ పది లక్షల తోనే కార్పొరేషన్ కార్యాలయం నిర్మాణం
దిశ, కుత్బుల్లాపూర్ : ప్రభుత్వ యంత్రాంగంలో కొన్ని సార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు చేసే పనులు సామాన్యులకు అంతుచిక్కడం కష్టమే. పాలకుల మెప్పు కోసం, అయిన వారి సంతోషం కోసం అధికారులు ఇచ్చే సలహాలు, అధికారిక చర్యలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇలాంటి ఘటనే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో శనివారం చోటు చేసుకుంది. ఆగ మేఘాల మీద కేవలం పది లక్షలతో మున్సిపల్ కార్యాలయం భవంతి నిర్మాణం అంటూ శనివారం భూమి పూజ చేపట్టడం స్థానికులను, పౌర సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. నిజాంపేట్ సర్వే నెంబర్ 233/1 లో గల ప్రభుత్వ భూమిని నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయంకు సుమారు 4 ఎకరాలు పై బడిన భూమిని పూర్వ మున్సిపల్ కమిషనర్ గోపి కలెక్టర్‌తో మాట్లాడి అలాట్ చేయించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెన్సింగ్ కూడా అప్పట్లో వేసి భూమిని కబ్జా కాకుండా మున్సిపల్ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అయినప్పటికీ సంవత్సరాలు గడిచిన కార్యాలయాల నిర్మాణం జరగలేదు. అలా జాప్యం జరిగేలా మానేజ్ చేసేందుకు అందులో కొందరు ప్రజా ప్రతినిధుల స్వలాభం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి తరుణంలో ఈ భూమిపై కొందరు స్థానికులు మాకు అసైన్డ్ పట్టా ఉందని, తామే పొజిషన్లో ఉన్నట్లు చూపుతూ కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తీసుకున్నారు. వాస్తవానికి కోర్ట్ ఆర్డర్ పొందిన వ్యక్తులు ఎలాంటి పొజిషన్ లేకున్నప్పటికీ ప్రజా ప్రజాప్రతినిధుల అండతో స్కెచ్ వేసి మున్సిపల్‌కు అలాట్ చేసిన భూమిని తమ వశం చేసుకున్నారు.
హడావుడి శంకుస్థాపన @ పది లక్షలు రూ. లతో నిర్మాణం ఎలా?...
అయితే ఆ స్థలం పక్కన మున్సిపల్ కోసం కొంత మేరకు ఖాళీ స్థలంలో శనివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద, నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. కోట్లు నిధులు కేటాయిస్తే కానీ పూర్తి కానీ మున్సిపల్ బిల్డింగ్ కేవలం పది లక్షలతో కేటాయిస్తూ భూమి పూజ చేయడం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందికీ జీతాలు ఇచ్చుకోలేక అవస్థలు పడుతున్న నిజాంపేట్ కార్పొరేషన్‌లో ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు అవసరమా అంటూ పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.
అయితే ఈ పది లక్షలు కేవలం స్థలం క్లీనింగ్ కోసమే అని ప్రకటన చేయడం పరిపాటి. రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ శివారు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ సిటీలో విలీనం చేయబోతున్నారనే వార్తలు నేపథ్యంలో నిజాంపేట్‌లో ఇలా ఏమాత్రం నిధులు సమాకుర్చుకోకుండా చేసిన శంకుస్థాపన పలు విమర్శలకు తావిస్తోంది. పై విషయం పై వివరణ కోరేందుకు దిశ ప్రతినిధి మేయర్‌ను, మున్సిపల్ కమిషనర్‌ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.