కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ ధర్నా

by S Gopi |
కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ ధర్నా
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను 1200 రూపాయలకు పెంచినందుకు నిరసనగా కేటీఆర్ పిలుపు మేరకు గురువారం కంటోన్మెంట్ లోని తాడ్ బంద్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ వంద మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన, ధర్నా నిర్వహించారు. కంటోన్మెంట్ ప్రజలు రానున్న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో గుర్తుపెట్టుకుని బీజేపీకి, గ్యాస్ సిలిండర్ బాదుడుకు దండం పెట్టండి అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మోని, రఘు, శ్రీను, ఫహీం, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed