పూర్తిగా నీట మునిగిన అయోధ్యా విల్లాలు.. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు

by Mahesh |   ( Updated:2023-09-05 06:57:40.0  )
పూర్తిగా నీట మునిగిన అయోధ్యా విల్లాలు.. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలకు ముప్పు
X

దిశ, దుండిగల్: తెల్లవారు జాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దుండిగల్ మున్సిపాలిటీ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బహదూరపల్లి బాబ్బాకాన్ చెరువు అలుగు పారడంతో లోతట్టు ప్రాంతాలైన అయోధ్యా విల్లాలు, సమీపంలోని పంటపొలాలు జలమయం అయ్యాయి. గండిమైసమ్మలోని సాయి పూజ కాలనీ, శ్రీనివాస కాలనీ లోని లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సహక చర్యల్లో పాల్గొనాల్సిన మున్సిపల్ అధికారులు చేతులెత్తేయడం తో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ముక్యంగా బహదూరపల్లిలోని అయోధ్యా విల్లాలు పూర్తిగా నీటమునిగి ఇళ్లలోకి నీరు ప్రవేశించిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని అసోసియేషన్ సభ్యులు సగ్గిడి నర్శింగా రావు ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్యా నీట మునగడాని ప్రైమార్క్ నిర్మాణ దారుడు బాబ్బాకాన్ చెరువు కట్ట కాలువను కబ్జా చేసి పూర్తిగా పూడ్చి వేశాడని.. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థ లేకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధుల,అధికారల నిర్లక్ష్యం అవస్థలకు కారణమంటూ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నీట మునిగిన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల

గుండ్లపోచంపల్లిలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు, కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్టళ్లు లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో విద్యార్థులు హాస్టల్ గదుల్లో నుంచి బయటకు రాలేక నానా అవస్థలు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సమీపంలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజి, సైంట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింహా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు పూర్తిగా నీట మునగడంతో వేలాది మంది విద్యార్థులు అవస్థలు పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed