ఓటరు జాబితాలో ఎప్పటికప్పుడు సవరణలు : రహమత్ అలీ

by Aamani |
ఓటరు జాబితాలో ఎప్పటికప్పుడు సవరణలు : రహమత్ అలీ
X

దిశ, మేడ్చల్ బ్యూరో: క్రితం వరకు జరిగిన ఎన్నికల నిర్వహణలో తలెత్తిన లోటుపాట్లను గుర్తించి వాటిని అధిగమించే విధంగా ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జాతీయ ఎలక్షన్ కమిషన్ రూపొందిస్తుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల పరిశీలకులు రహమత్ అలీ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యాలయ సమావేశం మందిరంలో గురువారం నిర్వహించిన జిల్లా ఎన్నికల ప్రణాళిక సమావేశానికి ఆయన మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో మొత్తం రెండు వేల 435 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అయినప్పటికీ ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుందని, జరగబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారి యంత్రాంగం తో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకుల సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు. ఓటరు జాబితాలో ఎప్పటికప్పుడు సవరణలు చేసుకుంటూ నమోదు తొలగింపు ప్రక్రియలను చేయాలని అన్నారు. డిసెంబర్ నెల నాటికి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి త్వరగా వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకునే విధంగా యంత్రాంగం పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మేడ్చల్ మల్కాజగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియ, ఆర్డిఓ సైదులు, స్వాప్ అధికారి సాంబశివరావు, వివిధ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఆశా వర్కర్లకు సమయానికి పారితోషికం ఇవ్వండి: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

భార్యాభర్తలకు వేరువేరు పోలింగ్ కేంద్రాలలో కాకుండా ఇరువురికి ఓకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రణాళిక సమావేశానికి ఆయన హాజరయ్యి పలు సూచనలు చేశారు. ఓటరు నమోదు కార్యక్రమం సక్రమంగా పకడ్బందీగా చేపట్టాలని, జియో టాకింగ్ సరైన పక్రియలో నిర్వహించాలని తెలిపారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటు నమోదు ప్రక్రియలో కీలక భూమిక పోషించే ఆశ వర్కర్లకు ఇతర సిబ్బందికి సరైన సమయంలో పారితోషికం అందే విధంగా తప్పకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎన్నికల అధికారులను కోరారు.

Advertisement

Next Story

Most Viewed