- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్రమ నిర్మాణాలపై చర్యలేవి..?
దిశ, కూకట్పల్లి: హౌసింగ్‌బోర్డు అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు ఎంత చెప్పినా సాయినగర్‌లో అక్రమ నిర్మాణదారులు తగ్గేదేలే అన్న విధంగా యధేచ్ఛగా నిర్మాణ పనులు చేపడుతూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఓ వైపు జీహెచ్ఎంసీ నోటీసులు అందజేసినా, మరోవైపు హౌసింగ్ బోర్డు అధికారులు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినా కబ్జా చేస్తున్న వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధి కేపీహెచ్‌బీ డివిజన్ సాయి నగర్ కాలనీలో హౌసింగ్ బోర్డుకు చెందిన ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు పీకేసి కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున విషయంలో గత కొంత కాలంగా హౌసింగ్ బోర్డు అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యలు కొలిక్కి రావడం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాన్ని నిలిపేయాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చి నిర్మాణ పనులను నిలిపేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
ప్లాట్ నంబర్ 92లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కుక్కను వదిలి అక్కడి వచ్చే జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బందిపై ఉసి గొలుపుతున్నట్టు టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సాయినగర్‌లోని సర్వే నంబర్ 1056, 1057 లలోని కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కొంత మంది పక్క గ్రామం అయిన హైదర్ నగర్‌కు చెందిన సర్వే నంబర్ 145 పేరుతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హౌసింగ్ బోర్డు ఈఈ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అక్రమ నిర్మాణదారుడిపై కేసు నమోదు..
సాయినగర్ కాలనీలోని ప్లాట్ నంబర్ 92కు చెందిన ఎల్. నాగేశ్వర్ రావు, మరి కొంత మందితో కలిసి హౌసింగ్ బోర్డుకు చెందిన స్థలంలో హెచ్చరిక బోర్డులను తొలగించిన 208 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నట్టు హౌసింగ్ బోర్డు ఈఈ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఈ నెల 12వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎల్. నాగేశ్వర్రావు, ఎం. కిరణ్బాబులపై క్రైం నంబర్ 369/2023, ఐపీసీ 447, 427, ఆర్/డబ్ల్యూ 34 కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఎల్. నాగేశ్వర్ రావు కోర్టులో జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణ పనులను అడ్డుకోకుండా జీహెచ్ఎంసీకి వ్యతిరేకంగా 2 మార్చి 2023 న ఓఎస్ నంబర్ 74 ఆఫ్ 2023 కోర్టును ఆశ్రయించగా జీహెచ్ఎంసీ నిర్మాణ పనులను అడ్డుకోవద్దు, నాగేశ్వర్రావు ఎటువంటి పనులు చేపట్టవద్దంటూ కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా కోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను ధిక్కరిస్తూ యధేచ్ఛగా నిర్మాణ పనులు నిర్వీరామంగా కొనసాగుతున్నాయి.
ఐపీఎస్లేఖకు మరో ఐపీఎస్ స్పందన శూన్యం..
హౌసింగ్ బోర్డు స్థలాన్ని కాపాడాలంటూ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఐపీఎస్ అధికారిని గత కొన్ని రోజుల క్రితం జీహెచ్ఎంసీ కమిషనర్ ఐపీఎస్ అధికారికి లేఖ రాశారు. కాగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు అమలు చేసే వారు మూసాపేట్ సర్కిల్లో కనిపించడం లేదు. నిర్మాణ పనులు అడ్డుకోవడంలో గత నాలుగు రోజులుగా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు విఫలం అవుతున్నారు. ఒక రోజు సిబ్బంది కొరత, మరో సారి ఇంకో సాకు. ఇటు జీహెచ్ఎంసీ అటూ హౌసింగ్ బోర్డు అధికారులతో ప్లాట్ నంబర్ 63, 92లలో నిర్మాణం చేపడుతున్న అక్రమ నిర్మాణదారులు బంతాట ఆడుకుంటూ తమ నిర్మాణ పనులను చేపడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.
రెండు ప్రభుత్వ భూములే..
సాయినగర్‌కాలనీ వాసులు కూకట్పల్లి మండలం సర్వే నంబర్ 1056, 1057 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ హౌసింగ్ బోర్డు అధికారులు ఆరోపిస్తుంటే, కావు సాయినగర్ కాలనీ హైదర్‌నగర్ గ్రామం సర్వే నంబర్ 145కు చెందిన భూమిలో ఉందని, 1992లోని తాము ఇంటి స్థలాలు కొనుగోలు చేశామని, రిజిష్ట్రేషన్ అయిందని సాయినగర్ కాలనీ వాసులు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా హైదర్‌నగర్ గ్రామం సర్వే నంబర్ 145 ప్రభుత్వ భూమిగా, ప్రొహిబిటేడ్ లిస్ట్‌లో ధరణి పోర్టల్‌లో దర్శనమిస్తుంది. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీవో నంబర్ 59లో సాయినగర్ కాలనీ నుంచి పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. కొంత మంది ఆన్లైన్ ద్వారా వచ్చిన డిమాండ్ నోటీస్ ప్రకారం ఆన్లైన్లో రెవెన్కూ శాఖకు డబ్బులు చెల్లించారు. సాయినగర్ కాలనీ ప్రభుత్వ భూమి కాబట్టే జీవో నంబర్ 59 ప్రకారం క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్నారని స్థానికులు తెలిపారు.