- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముందు మంచి నీళ్లు అడిగాడు... ఆ తర్వాత మెల్లగా ఇంట్లోకొచ్చి...
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: మంచినీళ్లు అడిగి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని ఆగంతకుడు పదిహేను తులాల వెండి, ఇరవై ఐదు వేల నగదు చోరీకి పాల్పడిన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్ పెక్టర్ రవికుమార్, క్రైమ్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలప్రకారం.. న్యూ బోయిన్ పల్లిలో నివాసం ఉండే కుమ్మరి లక్ష్మి, శంకర్ లు గత కొంత కాలంగా ఉంటున్నారు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు భానుప్రియ(19) పనిమీద వారి స్వగ్రామం నల్గొండకు వెళ్ళింది. దీంతో తండ్రి శంకర్ కూతురును తీసుకురావడానికి శుక్రవారం నల్గొండకు వెళ్ళాడు. అయితే శనివారం తల్లి కుమ్మరి లక్ష్మి పనికి వెళ్లగా కుమారుడు ఆరేషు(9) ఇంట్లోనే ఉన్నాడు. ఆరేషు ఆడుకుంటుండగా ఓ గుర్తుతెలియని ఆగంతకుడు ఆరేషును మంచినీళ్లు కావాలి అని అడిగాడు. దీంతో ఆ బాలుడు ఇంట్లోకి వెళ్లగానే ఆ ఆఆగంతకుడు ఇంట్లోకి చొరబడి అల్మారా తీసి అందులో ఉన్న 25 వేల నగదు, 15 తులాల వెండిని ఎత్తుకెళ్లాడు. విషయం తెలుసుకున్న కుమ్మరి లక్ష్మి బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.