మేడారం వద్ద ‘హలాల్ మాంసం’ తినడానికి వీళ్లేదు.. ప్రధాన పూజారి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
మేడారం వద్ద ‘హలాల్ మాంసం’ తినడానికి వీళ్లేదు.. ప్రధాన పూజారి కీలక వ్యాఖ్యలు
X

దిశ, మంగపేట: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద ఈ జాతర జరుగనుంది. ఇప్పటికే ఈ జాతర నిమిత్తం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు మంజూరు చేయగా.. కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

నిత్యం జాతర ఏర్పాట్లను మంత్రులు సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇదిలా ఉండగా.. జాతర ప్రారంభం వేళ మేడారం ప్రధాన పూజారి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేడారం మహా జాతరలో కొందరు భక్తులు అమ్మవార్లకు మొక్కి బలిచ్చే మేకలు, కోళ్లను హలాల్ చేయొద్దని సూచించారు. హలాల్ చేయడం సంస్కృతీ, సాంప్రదాయాలకు విరుద్ధమని చెప్పారు. మేడారం వచ్చే భక్తులంతా గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలను తప్పక గౌరవించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed