- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంటర్ లో ఫెయిలయ్యానని యువతి ఆత్మహత్య
దిశ, చిన్నకోడూరుః ఇంటర్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని సికింధ్లపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పండగ రాజయ్య లచ్చవ్వ లకు ఇద్దరు కుమారులు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొంతకాలం క్రితమే రాజయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. చిన్న కూతురు భవాని (17) ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయింది. తిరిగి సప్లమెంటరీ రాసినా పాస్ కాకపోవడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం పురుగుల మందు సేవించింది. కడుపులో మండుతుందని రోడ్డుపైకి రావడంతో చుట్టుపక్కల వారు సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ భవాని బుధవారం మృతి చెందింది. తల్లి లచ్చవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.