- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
by Naresh |
X
దిశ, చేగుంట: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగ్ మండల పరిధిలోని భీమ్రావుపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. నార్సింగ్ ఎస్ఐ అహ్మద్ మోహినుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని భీమ్రావు పల్లి గ్రామానికి చెందిన ఇప్ప కలమ్మ (40) భర్త రాములుతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూలి పని చేసుకుని వచ్చే డబ్బులతో చిట్టీలు కట్టుకుంటూ సాఫీగా సంసారం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం డబ్బులు విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరగగా మనస్థాపం చెంది ఇప్ప కలమ్మ ఇంటి ముందున్న రేకుల షెడ్డులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భర్త రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story